గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (17:08 IST)

ఉగాది సంద‌ర్భంగా సర్కార్ వారి పాట యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్ రిలీజ్‌

Mahesh uagadi poster
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్,  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `సర్కారు వారి పాట` ఈ సంవత్సరం విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రాలలో ఒకటి. వేసవిలో సినిమా అభిమానులకు 'సూపర్ స్పెషల్' ట్రీట్‌ను అందించడానికి ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్ర నిర్మాతలు స‌రికొత్త  యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మహేశ్ బాబుపై గూండాలు ఆయుధాలతో దాడికి సిద్ధపడుతుండ‌గా, ‘సూపర్ స్టార్’ తన బెల్ట్ తీస్తూ, వారిపై దాడికి సిద్ధంగా వున్నాడు. ఈ గెట‌ప్‌లో మ‌హేష్ కూల్‌గా, మోడిష్‌గా కనిపిస్తున్నా దాడి చేయ‌డానికి ధృడంగా వున్న‌ట్లు అత‌ని లుక్ తెలియ‌జేస్తోంది.
 
చిత్రానికి సంబంధించిన రెండు పాట‌ల‌కు అద్భుతమైన స్పందన రావడంతో మ్యూజికల్ ప్రమోషన్‌లు కూడా జోరందుకున్నాయి. కళావతి మెలోడీ ప్రేమికులను ఆకర్షించగా, రెండవ ట్రాక్, మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తొలిసారిగా కనిపించిన పెన్నీకి అద్భుతమైన స్పందన వచ్చింది. సితార డ్యాన్స్‌కు పలువురు మెచ్చుకున్నారు.
 
ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ థమన్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ ఇస్తున్నారు.
 
మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.
 
ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వున్నారు.
 
తారాగణం: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.
 
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీత దర్శకుడు: థమన్ ఎస్ఎస్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్ - లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో-డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
CEO: చెర్రీ
VFX సూపర్‌వైజర్ - యుగంధర్