యన్‌టిఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో నటించాలనుంది: రిద్ది కుమార్
మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించి రిద్ది కుమార్ అనతి కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. "ఫేస్ ఆఫ్ ఇండియా" అవార్డ్‌ను గెలుచుకొని తన ప్రతిభను చాటుకుంది. చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం నటనా ప్రతిభ ఉన్నటువంటి ఈ కేరళ బ్యూటీకి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్‌తో 2018లో దిల్ రాజు ప్రొడక్షన్ లోని "లవర్"లో యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు జోడీగా నటించి తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ చిత్రానికి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు.ఆ తర్వాత ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు అశ్విన్ హీరోగా నటించిన "అనగనగా ఓ ప్రేమ కథ" చిత్రంలో నటించినా కూడా ఆశించినంత విజయాన్ని అందుకోలేక పోయింది. అయితే నటిగా మంచి గుర్తింపును దక్కించుకుంది.
ఆ తరువాత మలయాళం, కన్నడ,మరాఠీ, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు రావడంతో తెలుగు ఇండస్ట్రీ దూరం అయింది.అయితే తన అభిమానుల కోసం తను చేసే యాక్టీవిటీ గురించి తన ఫొటోస్ లను సామాజిక మాద్యమమైన ఇన్స్టా గ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్‌ల ద్వారా షేర్ చేస్తూ ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. అయితే "శతమానంభవతి" దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న "కోతికొమ్మచ్చి" సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఇప్పటివరకు "రాదే శ్యామ్" సినిమాలో పూజా హెగ్డే మాత్రమే కనిపించేది.
ఇప్పుడు తాజాగా అలనాటి అందాల తార భాగ్యశ్రీ, ప్రభాస్‌కు తల్లిగా నటిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే... అయితే రీసెంట్‌గా యువి క్రియేషన్స్ వారు విడుదల చేసిన "రాధే శ్యామ్" ట్రైలర్లో అర్చరీ విభాగంలో స్పోర్ట్ వుమెన్‌గా తళుక్కున మెరిసింది రిద్ది కుమార్ ఈ సినిమాలో ఏమైనా మలుపు తిప్పే పాత్ర చేస్తుందేమో అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ప్రేమ కథ చిత్రంలో స్పోర్ట్స్ ఏంటి ? రిద్ది కుమార్ రోల్ ఏంటి? అనేది ప్రేక్షకులకు తెలియాలంటే మార్చి 11 వరకు వెయిట్ చేయాల్సిందే. తను చేసింది రెండు సినిమాలే అయినా అప్పుడే ప్రభాస్‌తో నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ శుక్రవారం హైదరాబాద్‌లో "రాధే శ్యామ్" గురించి పాత్రికేయులతో మాట్లాడుతూ..
మాది పూణే. మా నాన్న ఆర్మీ ఆఫీసర్, నేను పూణే లోనే ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేశాను. చిన్నప్పటి నుండి సినిమాలు అంటే ఎంతో ఇష్టం. అందుకే సినిమాలో నటించాలనే కోరిక ఉండేది. ఆ తరువాత మోడలింగ్‌లో అవకాశం రావడం తరువాత సినిమాలలో నటించే అవకాశం రావడం జరిగింది. తెలుగులో నేను తక్కువ సినిమాలు చేసినా ఇంత తక్కువ సమయంలోనే ప్రభాస్ వంటి బిగ్ స్టార్‌తో చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
ఇందులో స్పోర్ట్స్ విమెన్ క్యారెక్టర్ చేస్తున్నాను. స్పోర్ట్స్ ఉమెన్‌గా చేయడం చాలా కష్టం. ఈ సినిమా లోని క్యారెక్టర్ కొరకు నేను అర్చరీ నేర్చుకున్నాను. యువి క్రియేషన్ వారు, డైరెక్టర్ రాధా గారు నన్ను బాగా చూసుకున్నారు. ఇటలీలో వర్క్ చేసినప్పుడు కూడా ప్రభాస్ గారు షూటింగ్‌లో ఎంతో బిజీగా వున్నా మాతో ఎంతో జోవియల్‌గా ఉంటూ నవ్వించే వారు. తను చాలా హుంబుల్ పర్సన్. తనతో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
ఇందులో నా పాత్ర బబ్లీగా కాకుండా పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. ఇందులో నాపై ఎటువంటి సాంగ్స్ ఉండవు. అందుకే నేను కూడా ఈ సినిమా కోసం మీ కంటే ఎక్కువగా క్యూరియసిటీగా ఎదురుచూస్తున్నాను. నా పెర్ఫార్మన్స్ ఎలా ఉంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారని. అయితే ఇందులో నా క్యారెక్టర్ ఏంటనేది ఇప్పుడు చెప్పలేను. మీరందరూ కూడా 11వ తేదీ వరకు ఆగాల్సిందే.
నేను ఆమేజాన్ ప్రైమ్ సిరీస్‌లో స్టూడెంట్ జానర్లో నటించిన వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోతుంది. మేలో రిలీజ్ అవుతుంది. రేవతి మేడమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. ఇందులో కాజోల్ లీడ్ క్యారెక్టర్ చేస్తుంది. ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. తల్లి,కొడుకు, కూతురు మధ్య సాగే ఎమోషనల్ మూవీ ఇందులో నేను కూతురుగా నటిస్తున్నాను. ఇవే కాకుండా ఇంకా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాను. నాకు డిటెక్టివ్ క్యారెక్టర్స్, ఫన్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం ఇలాంటి పాత్రలు చేయాలని ఉంది. ఇంకా టాలీవుడ్లో నేను జూనియర్ యన్ టి.ఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇలా అందరి హీరోలతో నటించాలానే కోరిక ఉందని అన్నారు.