గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2022 (10:15 IST)

జాతీయ జెండాకు ఏపీ సీఎం జగన్ - టీ సీఎం కేసీఆర్ సెల్యూట్

ysjagan
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రావులు జాతీయ జెండాను ఎగురవేసి సెర్యూట్ చేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత సోమవారం సాయంత్రం ఆయా రాష్ట్రాల రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో ఇరు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొననున్నారు. 
 
కాగా, విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి హాజరయ్యారు. మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం అందుకున్నారు. 
 
వేడుకల్లో భాగంగా 12వ కంటిజెంట్స్ నిర్వహించిన పరేడ్‌ను సీఎం జగన్ తిలకించారు. ఆ వాహనంలో ఆయన వెంటన సీఎస్ శమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. అలాగే, 10 బ్యాండ్స్ ప్రదర్శన నిర్వహించారు. 
 
స్వాత్రంత్య వేడుకల సందర్భంగా వివిధ శాఖల శకటాలను సిద్ధం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ‘ఎట్ హోం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు నేతలు, అధికారులు హాజరుకానున్నారు.
kcr salute
 
అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారితో పాటు ప‌లువురు నాయ‌కులు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
 
ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఎగుర‌వేసిన అనంత‌రం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్క‌డ అమ‌ర జ‌వానుల స్మృతి చిహ్నం వ‌ద్ద కేసీఆర్ నివాళుల‌ర్పించారు. స్వ‌తంత్ర భార‌త స్వ‌ర్ణోత్స‌వ వేళ‌.. భార‌త స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల త్యాగాలను కేసీఆర్ స్మ‌రించుకున్నారు.