నేడు బాపట్ల జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అలాగే, జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసికం నిధులను కూడా విడుదల చేయనున్నారు. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.
కాగా, ఈ జిల్లా పర్యటన కోసం ఆయన ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో బయలుదేరి ఉదయం 10.10 గంటలకు బాపట్లకు చేరుకుంటారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన అక్కడ నుంచి హెలికాఫ్టరులో మధ్యాహ్నం 12.40 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.