శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జులై 2022 (11:56 IST)

ఏపీలో ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రజా ఉపయోగ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబానికి ఓ ఫ్యామిలీ డాక్టర్ వైద్యసేవలను అందుబాటులోకి తేవాలన్నదే ఈ పథకం లక్ష్యమన్నారు. 
 
ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంపై ఈ నెల 26వ తేదీన మాస్టర్ ట్రైనర్లకు వర్క్‌షాపు నిర్వహించామని ఆయన తెలిపారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడికి శాశ్వతమైన మొబైల్ నంబరును కేటాయించనున్నట్టు తెలిపారు. 2022 డిసెంబరు నాటుకి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.