సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (15:01 IST)

డిమాండ్ల సాధన కోసం వచ్చిన టీచర్లు.. క్లాస్ పీకిన మంత్రి బొత్స

botsa
తమ డిమాండ్ల పరిష్కారం కోసం సచివాలయానికి తనను కలిసేందుకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ క్లాస్ పీకారు. రోజూ ఎనిమిది గంటలు పాటు ఎందుకు పని చేయరంటూ నిలదీశారు. ఈ మేరకు సచివాలయంలో తమ డిమాండ్లతో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిసిన సందర్భంగా నిలదీశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఉపాధ్యాయ సంఘాలు బెదిరింపు ధోరణితో డిమాండ్లను సాధించుకునేందుకు యత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు. బెదిరిస్తే పనులు జరగవని తేల్చి చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు అనుకున్నవన్నీ కావాలంటే ఎలాగంటూ నిలదీశారు. ఈ సందర్భంగా రోజుకు 8 గంటలు పని చేయాలని ఉపాధ్యాయులకు ఆయన క్లాస్ పీకారు.