గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (09:32 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఎంసెట్ పరీక్షా ఫలితాల వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఎంసెట్ పరీక్షా ఫలితాలను వెల్లడించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారు. 
 
ఇంజినీరింగ్‌, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 3,01,172 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,82,496 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఇంజినీరింగ్‌ పరీక్ష 1,94,752, వ్యవసాయ కోర్సు పరీక్ష 87,744 మంది రాశారు. 
 
ఈ పరీక్షా ఫలితాలను తొలుత అనంతపురంలో ఈ నెల 29వ తేదీన విడుదల చేయాలని భావించినా అనివార్య కారణాలతో అక్కడ ఫలితాలను విడుదల చేయలేదు. ఇపుడు విజయవాడలో విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.