1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ramarao On Duty Pre release event on July 24

నేడు రవితేజ "రామారావు ఆన్ డ్యూటీ" ప్రీరిలీజ్ ఈవెంట్

Rama Rao on duty, Ravi Teja
మాస్ మహారాజ్ రవితేజ నటించిన కొత్త చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ". ఈ నెలాఖరులో అంటే 29వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో ప్రిరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. 
 
శ్యామ్ సీఎస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటరులో నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. 
 
పైగా, ఈ కార్యక్రమానికి రవితేజ అభిమానులు తెల్ల చొక్కాతో రావాలని ఓ పోస్టరు ద్వారా తెలిపారు. "మజిలీ" తర్వాత దివ్యాన్ష చేసిన సినిమా ఇది. ఇక రజీషా విజయన్‌కు ఇది తొలి తెలుగు చిత్రం. ఈ సినిమాతోనే తొట్టెంపూడి వేణు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో నాజర్, పవిత్రా లోకేశ్‌లు నటించారు. 
తర్వాతి కథనం
హైదరాబాదులో ప్రభాస్ "ప్రాజెక్ట్ K" మరో షెడ్యూల్ పూర్తి!