శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మే 2022 (19:16 IST)

'ఫన్'టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. అంతా రెడీ

venkatesh
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 చిత్రం హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే కాంబోలో వస్తున్న ఎఫ్3 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 
 
ఈ సారి వెంకీ, వరుణ్‌లకు కామెడీ కింగ్ సునీల్ కూడా తోడవడంతో వినోదం ఏ రేంజిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఎఫ్3లో హాస్యనటుడు అలీ కూడా నటించాడు. 
 
ఆలీతో అనిల్ రావిపూడి 'పాలబేబీ' అనే వడ్డీ వ్యాపారి పాత్రను చేయించారు. తెరపై అలీ పాత్ర చాలా సేపు ఉంటుంది .. నాన్ స్టాప్‌గా నవ్విస్తుంది. చాలా కాలం తరువాత ఒక మంచి పాత్రను చేసిన ఫీలింగ్ కలిగిందన్నాడు ఆలీ. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
 
ఎఫ్ 2కు సీక్వెల్‌గా ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిసున్నారు. ఇప్పటికే విడుదలైన ఎఫ్ 3 ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఎఫ్3 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 21న హైదరాబాదులో నిర్వహించనున్నారు. శిల్పకళావేదిక ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం వుంటుంది. 'ఫన్'టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అంతా సిద్ధం అని యూనిట్ పేర్కొంది.