శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 జులై 2022 (10:38 IST)

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మాస్ మహారాజా

raviteja
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మాస్‌ మహారాజ్‌ రవితేజ నటించనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి 154వ చిత్రంలో రవితేజ నటించనున్నారు. 
 
గురువారం నుండి ఈ చిత్ర షూటింగ్‌లో రవితేజ పాల్గొనున్నారని సమాచారం.హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో రవితేజ, చిరంజీవిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు 'వాల్తేరు వీరయ్య' టైటిల్‌ పరిశీలనలో ఉంది.
 
బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజాగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరపుకుంటోంది. 
 
చిరంజీవి ఈ సినిమాలో మత్స్యకారునిగా నటిస్తున్నారు. కాగా, రవితేజ గతంలో చిరంజీవికి తమ్ముడిగానూ.. పలు సినిమాల్లో పాటల్లో సందడి చేసిన సంగతి విదితమే. రవితేజ నటిస్తున్న రామారావ్‌ అన్‌ డ్యూటీ విడుదలకు సిద్ధంగా ఉంది.