సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 జులై 2022 (07:50 IST)

మెగాస్టార్ చిరంజీవిచ గాడ్ ఫాదర్ చిత్రంలో పూరి జగన్నాథ్‌

Godfather poster Look
Godfather poster Look
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 'గాడ్ ఫాదర్' చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం నుండి మెగా అప్దేట్ వచ్చింది. గాడ్‌ఫాదర్  ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 4న సాయంత్రం 5:45 గంటలకు లాంచ్ చేయనున్నారు. గాడ్‌ఫాదర్ రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ఫస్ట్ లుక్ డేట్ ని ప్రకటించింది.
 
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు మెగాస్టార్లకు ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే ఓ బాబింగ్ సాంగ్ వుంది. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌కు  ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
 
టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.  సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
 
టాప్ టెక్నికల్‌ టీమ్‌ గాడ్ ఫాదర్  కోసం పని చేస్తున్నారు. వెటరన్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు.
 
ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.
 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్
సమర్పణ: కొణిదెల సురేఖ
బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్
సంగీతం: ఎస్ ఎస్ థమన్
డీవోపీ: నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు