గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (14:51 IST)

నయనతార సంచలన నిర్ణయం: ఆస్తులన్నీ ఆయన పేరు మీద మార్చేసిందట!

nayanatara_vignesh
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార సంచలన నిర్ణయం తీసుకుందట. పెళ్లికి తర్వాత హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార తన ఆస్తులను మొత్తం విగ్నేశ్ పేరుమీదకి మార్చేసిందట. కోలీవుడ్‌లో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్‌గా మారింది. 
 
ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అతని పేరిట రాయడం..అభిమానులకు నచ్చలేదు. ఈరోజుల్లో పెళ్లి బంధం అనేది ఓ గేమ్ లా అయిపోయింది. ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు విడిపోతారో ఎవ్వరు ఊహించలేకపోతున్నారు. 
 
అలాంటిది నయన్ తన ఆస్తులను విగ్నేశ్ శివన్ పేరుపై మార్చారు అని న్యూస్ వైరల్ కావడం సంచలనంగా మారింది. 
 
నయన్ తెలిసి తెలిసి ఇంత పెద్ద తప్పు ఎలా చేశారు అంటూ..అభిమానులు మండిపడుతున్నారు. ఏది ఏమైన నయన్ విగ్నేశ్ మాయలో ఇలాంటి పనిచేసిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.