శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 28 జూన్ 2022 (15:24 IST)

నడవలేని స్థితిలో నిత్యామీనన్, పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేస్తుందా?

Nithya Menon
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాలెంట్ ఎక్కడ వుందో వెతికి పట్టుకుని ఛాన్సులు ఇస్తుంటారు. దాని ఫలితం గురించి తర్వాత సంగతి. కొత్తవారిని వెండితెరకు పరిచయం చేస్తుంటారు. అలా ఆయన చేతులు మీదుగా చాలామంది నటులు, టెక్నీషియన్స్ వెండితెరకు పరిచయమై రాణిస్తున్నారు.

 
ఇక అసలు విషయానికి వస్తే.... భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ సరసన నటించిన నిత్యా మీనన్ ఓ పాపులర్ స్టార్ చిత్రానికి దర్శకత్వం వహించబోతోందట. ఆ స్టార్ ఎవరా అని ఆరా తీస్తే... పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటున్నారు సినీజనం. భీమ్లా నాయక్ చిత్రం చేసేటపుడు పవర్ స్టార్‌కి మంచి స్టోరీ లైన్ వినిపించిదట ఈ హీరోయిన్. లైన్ నచ్చడంతో డెవలప్ చేయమన్నారట పవర్ స్టార్. అంతా కుదిరితే ఆయనతోనే నిత్యా మీనన్ దర్శకత్వంలో పిక్చర్ వస్తుందని చెప్పుకుంటున్నారు.

 
ప్రస్తుతం కాస్త వళ్లు చేసిన నిత్యా మీనన్ రెండు రోజుల క్రితం మెట్ల పైనుంచి నడుస్తూ కాలు స్లిప్ అయి పడిందట. దీనితో ఆమె మడమ ఫ్రాక్చర్ అయింది. దానికి చికిత్స చేయించుకున్న నిత్యా.. ఓ సినీ ఫంక్షనుకి వీల్ ఛైర్లో రావడంతో ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. ఏంటా.. అని ఆరా తీస్తే అసలు విషయం చెప్పిందట ఈ బొద్దుగుమ్మ.