సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (14:01 IST)

బిగ్ బాస్ షోలో వడ్డే నవీన్.. భారీ పారితోషికం ఆఫర్ చేశారట

Vadde Naveen
Vadde Naveen
బిగ్ బాస్ రియాల్టీ షోకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్‌ మొదటి వారంలో  ఆరో సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. షో ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే కంటెస్టెంట్స్‌ ఎవరన్నదానిపై చర్చ జరుగుతుంది. 
 
సెప్టెంబర్‌ మొదటి వారంలో ఆరో సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. షో ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే కంటెస్టెంట్స్‌ ఎవరన్నదానిపై చర్చ జరుగుతుంది. 
 
సీజన్‌ సిక్స్‌లో పాల్గొనేది వీరేనంటూ కొంతమంది పేర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లోకి తాజాగా  హీరో వడ్డే నవీన్‌ వచ్చి చేరాడు. ఒకప్పుడు స్టార్‌ హీరో అయిన వడ్డే నవీన్‌.. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. సినిమాల్లోనే కాకుండా  ఏ ఈవెంట్‌లో కూడా నవీన్‌ కనిపించడం లేదు. అసలు ప్రస్తుతం వడ్డే నవీన్‌ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు.
 
అయితే ఇప్పటికీ ఆయన సినిమాలు మాత్రం టీవీ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా నవీన్‌కి మహిళా ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంది. అందుకే బిగ్‌బాస్‌ నిర్వాహకులు వడ్డే నవీన్‌ని సీజన్‌ సిక్స్‌లోకి ఆహ్వానించారట. 
 
ఈ షోలో పాల్గొనడానికి మొదట్లో ఆయన ఒప్పుకోలేదట. దీంతో భారీ రెమ్యునరేషన్‌ని ఆఫర్‌ చేసి ఆయనను ఒప్పించారట. నవీన్‌తో పాటు సీజన్‌ సిక్స్ లిస్ట్‌లో  జబర్దస్త్ కమెడియన్స్ ఆది, దీప్తి పిల్లి, వర్షిణి, యాంకర్ ధనుష్, ఓటీటీ  కంటెస్టెంట్‌లు శివ, అనిల్, మిత్రాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.