గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (14:20 IST)

పూర్ణతో మితిమీరి ప్రవర్తించలేదు.. మూడు సినిమాలు చేసింది...?: రవిబాబు

టాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించాడు రవిబాబు. రవిబాబు దర్శకత్వం వహించిన చాలా సినిమాలను కేవలం హీరోయిన్ భూమిక, పూర్ణను మాత్రమే పెట్టుకోవడం గమనార్హం. పూర్ణతోనే ఆయన ఏకంగా మూడు సినిమాలు చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని అందుకే వరుసగా పూర్ణ హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అయితే ఈ వార్తలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు రవిబాబు. తాను ఎథిక్స్, వ్యాల్యూస్‌ని నమ్మే దర్శకుడిని అని, షూటింగ్ అయిపోయాక ప్యాకప్ చెప్పేసిన తర్వాత ఇంతవరకు ఏ అమ్మాయితో కానీ ఏ హీరోయిన్‌తో కూడా మాట్లాడలేదు అని ఆయన వెల్లడించాడు. 
 
హీరోయిన్ పూర్ణతో రవిబాబు అవును, అవును2, లడ్డు బాబు సినిమాలు తీశారు. కానీ ఏ ఒక్క రోజు కూడా పూర్ణతో మితిమీరి ప్రవర్తించలేదని ఆయన తెలిపారు. అసలు పూర్ణతో కాకుండా భూమికతో కూడా ఆయన వరుసగా మూడు సినిమాలు చేశారు. నేను వర్క్ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటానని చెప్పుకొచ్చారు. 
 
తాను హీరోయిన్లతో వెకిలి వేషాలు వేస్తే ఆ హీరోయిన్లు తనతో రెండో సినిమా తీయరు కదా..? అంటూ కూడా రవి బాబు ప్రశ్నించారు. తాను పూర్ణతో మూడు వరుస సినిమాలు చేసింది కేవలం ఆమె అభినయాన్ని దృష్టిలో పెట్టుకునే తప్ప మరో విషయం ఆశించి కాదని తేల్చిచెప్పారు.