మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (12:29 IST)

ఇకపై నటించాలని లేదు.. చార్మీ కౌర్

తనకు సినీ అవకాశాలు ఇంకా వస్తూనే వున్నాయనీ, కాను తనకు మాత్రం నటించాలని లేదని సినీ నటి చార్మీ కౌర్ అన్నారు. తెలుగు తెరకు పరిచయమైన చార్మీ.. చాలా వేగంగా ఆమె వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్లింది. నాయిక ప్రధానమైన సినిమాలలోను నటించి మెప్పించిన ఈ పంజాబీ బ్యూటీ ఆ తర్వాత నటనకు ఫుల్‌స్టాప్ పెట్టేసి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్‌తో కలిసి సినీ నిర్మాణంలో దిగిపోయారు. 
 
ఈ క్రమంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "హీరోయిన్‌గా ఉండటంలోనే ఎక్కవ కంఫర్ట్ ఉంటుంది .. ఫిట్నెస్‌పై మాత్రమే దృష్టిపెడితే సరిపోతుంది. నిర్మాతగా బాధ్యతలను స్వీకరించడం మాత్రం అంత తేలికైన విషయమేం కాదు. అప్పుడు అందరి కంఫర్టును చూడవలసి ఉంటుంది.
 
హీరోయిన్‌గా ఉన్నప్పుడు నా పని వరకూ నేను చూసుకుంటే సరిపోయేది. కానీ నిర్మాతగా మారిన తర్వాత అలా కుదరదు. గాడిద చాకిరీ చేయవలసి వస్తోంది. అలా అని చెప్పేసి నాకేమీ విసుగు అనిపించడం లేదు. నటిగా నాకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇక నటించే ఆలోచన మాత్రం లేదు' అని స్పష్టం చేసింది.