గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (14:36 IST)

టాలీవుడ్‌కు మరో పవన్ కళ్యాణ్ దొరికారు : దిల్ రాజు

తెలుగు చిత్రపరిశ్రమకు హీరో విజయ్ దేవరకొండ రూపంలో మరో పవన్ కల్యాణ్ దొరికాడని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. అప్పట్లో  రెండు మూడు సినిమాలకే పవన్ కల్యాణ్‌కు ఎంత క్రేజ్ వచ్చిందో.. ఇప్పుడు విజయ్ దేవరకొండకూ అలాగే వచ్చిందని గుర్తుచేశారు. 
 
‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’తో విజయ్ స్టార్ డమ్ దక్కించుకున్నాడన్నారు. తన కుటుంబానికి చెందిన ఆశిష్‌ను ‘రౌడీ బాయ్స్’ చిత్రం ద్వారా దిల్ రాజు పరిచయం చేస్తున్నారు. సినిమా రెండో సాంగ్ విడుదల సందర్భంగా విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చారు. 
 
ఈ సందర్భంగా విజయ్‌పై దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. కథాంశం ఆధారంగానే సినిమాకు ‘రౌడీ బాయ్స్’ అనే పేరు పెట్టామని, విజయ్ దేవరకొండ పర్మిషన్ తీసుకున్నాకే పేరు ఖరారు చేశామని తెలిపారు. 
 
వాస్తవానికి తమ బ్యానర్‌లో వచ్చిన ‘కేరింత’ సినిమాలోని ముగ్గురు నాయకుల్లో ఒక నాయకుడిగా విజయ్ దేవరకొండ నటించాల్సి ఉందని, కానీ అది కుదరలేదని చెప్పారు. ఫొటోషూట్ సమయంలో విజయ్‌ను దూరం నుంచే చూశానన్నారు.
 
ఆ తర్వాత వచ్చిన ‘పెళ్లిచూపులు’ సినిమాను తమ బ్యానర్ ద్వారా విడుదల చేసేందుకు విజయ్ ప్రయత్నించినా.. ఆ సమయంలో తాను ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల కుదరలేదని తెలిపారు. తర్వాత ‘గీతగోవిందం’ సినిమా సక్సెస్ మీట్‌కు తాను వెళ్లానని, అక్కడ విజయ్ ఫాలోయింగ్‌ను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.