ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 19 మార్చి 2022 (21:26 IST)

పెళ్ళిపీట లెక్కబోతున్న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని.. ఎప్పుడు పెళ్లంటే..?

సినిమా హీరోహీరోయిన్లు పెళ్ళి చేసుకోవడం అరుదు. ప్రేమించుకోవడం..మధ్యలోనే ఆ ప్రేమ కాస్త తెగదెంపులు కావడం..ఆ తరువాత ఎవరినో ఒకరిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మామూలే. కానీ సినిమాల్లో నటిస్తూ పెళ్ళిళ్ళు చేసుకుని ప్రశాంతంగా ఉన్న కుటుంబాలు లేకపోలేదు.

 
యువ హీరోలు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు ఒకింటి వారు కాబోతున్నారట. వారే ఈ విషయాన్ని స్వయంగా చెప్పారట. త్వరలో మేము పెళ్ళి చేసుకోబోతున్నాం. గత కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నాం.

 
ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడింది. అందుకే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్. అయితే అందరినీ పిలవడం లేదు. కొంతమందినే పిలుస్తున్నాము.

 
కానీ పెళ్ళికి మాత్రం పిలుస్తాము. త్వరలోనే పెళ్ళి జరుగుతుంది. తేదీ కూడా అనుకున్నామంటున్నారు ఈ యువనటులు. త్వరలోనే వీరు పెళ్ళి  పీటలెక్కబోతున్న నేపథ్యంలో అటు తెలుగు, తమిళ సినీపరిశ్రమలో చర్చ జరుగుతోంది.