మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 మార్చి 2022 (20:26 IST)

అనసూయకు మెగాస్టార్ చిరంజీవి వార్నింగ్, ఎందుకు?

యాంకర్ అనసూయ పేరు చెబితే తెలియని వాళ్లుండరు. ఆమెకి అటు బుల్లితెరపైనా ఇటు వెండితెరపైనా కావల్సినంత క్రేజ్ వుంది. ఎలాంటి యాంకరింగ్ అయినా ఎలాంటి పాత్రనైనా ఇట్టే నటించి మెప్పిస్తుంది. అందుకే అనసూయకు అంత డిమాండ్.

 
ఇక అసలు విషయానికి వస్తే... మెగాస్టార్ ప్రధాన పాత్రలో గాడ్ ఫాదర్ అనే చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో అనసూయ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తుందట. దీనికి సంబంధించిన సన్నివేశాలు చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

 
సన్నివేశాల చిత్రీకరణలో మెగాస్టార్ వర్సెస్ అనసూయ సీన్లు వున్నాయట. మెగాస్టార్ చిరంజీవికి చిర్రెత్తే పనులు చేస్తుందట అనసూయ. అంతేకాదు... చివరికి జైలుకు పంపేలా చేస్తుందట. దీనితో మెగాస్టార్ అనసూయకు బిగ్ వార్నింగ్ ఇస్తాడట. ఇదంతా సినిమా సీన్ల సంగతి. నిజంగానే అనుకునేరు. కానే కాదు. మెగాస్టార్ చిరంజీవి చాలా చాలా మెతక కదా....