పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా నటిస్తున్నాడా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే తాజా సినిమా హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వుండాల్సింది. ఈ చిత్రానికి సంబంధించిన వార్తల ఒకటి బయట బాగా వినిపిస్తోంది. భవదీయుడు భగత్‌సింగ్ పేరుతో వచ్చే ఈ టైటిల్‌కు ఫుల్ కథను పవన్‌కు అందించలేదట. సగం నెరేషన్ చేశాక ఫుల్ కథను తీసుకువస్తే తప్పకుండా చేస్తానని నిర్మాతలు మైత్రీమూవీస్‌వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన కథ వర్క్ జరుగుతోంది.
అయితే తాజాగా అసలు ఆ సినిమా వపన్ చేయడంలేదని వినిపిస్తోంది. కానీ తాను చేయబోయే పాత్ర మాస్టారు తరహాలో లెక్చరర్‌గా వుంటేబాగుంటుందని సూచన చేశాడ. ఇప్పటికే పోలీసు, వకీల్ పాత్రలు పోషించిన పవన్ విద్యాలయాలపై ఓ కాన్సెప్ట్ చేయాలని కోరికను వ్యక్తం చేశాడట. దాంతో ఆ తరహా కథ రాబోతున్నట్లు సమాచారం. ఇలాంటి కథ తన రాజకీయజీవితానికి ప్లస్ అవుతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు.