సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (11:19 IST)

మోసపోయిన హీరోయిన్ నిక్కీ గల్రానీ... ఠాణాలో ఫిర్యాదు

నెలకు లక్ష రూపాయల చొప్పున ఇస్తానని చెప్పడంతో నమ్మిన హీరోయిన్ నిక్కీ గల్రానీ ఏకంగా రూ.50 లక్షలు పెట్టుబడిపెట్టింది. కానీ, ఆ వ్యక్తి... నెలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోడవంతో ఇపుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హాస్య నటుడు సునీల్ సరసన 'కృష్ణాష్టమి'తో పాటు 'మరకతమణి', 'మలుపు' తదితర చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచితమైన హీరోయిన్ నిక్కీ గల్రానీ.
 
ఈమె కర్నాటక రాష్ట్రంలో ఓ హోటల్ యజమాని చేతిలో మోసపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేసిన అధికారులు విచారణ ప్రారంభించారు. 
 
బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిఖిల్ అనే వ్యక్తి ఓ హోటల్‌ను ప్రారంభించగా, నిక్కీ రూ.50 లక్షల వరకూ పెట్టుబడిగా పెట్టింది. ఇందుకు ప్రతిఫలంగా తాను నెలకు రూ.లక్ష ఇస్తానని నిఖిల్ హామీ ఇచ్చాడు. 
 
పెట్టుబడి పెట్టి నెలలు గడిచిపోతున్నా నిక్కీకి ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె, పోలీసులను ఆశ్రయించి, ఇదే విషయాన్ని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హోటల్ యజమానిని పిలిచి విచారిస్తున్నామని తెలిపారు.