గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (08:52 IST)

నెల తప్పిన చెల్లి ... ప్రియురాలికి అబార్షన్ చేసి వదిలేసిన ప్రియుడు?

తన చెల్లి నెల తప్పగానే... తాను ఎంతగా ప్రేమించిన ప్రియురాలిని ఓ ప్రియుడు వదిలేశాడు. అదికూడా పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత గర్భస్రావం చేయించి ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి ఇపుడు హైదరాబాద్ నగర పోలీసులను ఆశ్రయించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సూర్యాపేట జిల్లాకు చెందిన దుగ్యాల ఐశ్వర్య(20) అనే యువతి డిగ్రీ చదివి బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఓ ప్రైవేటు సంస్థలో బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఏడాదిన్నర క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో మారెడ్డి అషేర్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది.
 
ఎవరికీ తెలియకుండా గత ఏడాది ఫిబ్రవరి 20న సంఘీ టెంపుల్‌లో ఐశ్వర్యను పెండ్లి చేసుకున్నాడు. అయితే కులాలు వేరుకావడంతో పాటు అషేర్‌ అవారాగా తిరుగుతుండటంతో ఐశ్యర్య కుటుంబ సభ్యులు పెండ్లిని అంగీకరించలేదు. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడటంతో వారిద్దరూ విడిపోయేందుకు సమ్మితించారు.
 
అప్పటినుంచి ఐశ్వర్య హాస్టల్‌లో ఉంటోంది. కొన్నాళ్లపాటు దూరంగా ఉన్న అషేర్‌ ఇటీవల మళ్లీ ఐశ్వర్యకు దగ్గరయ్యాడు. తన కుటుంబ సభ్యులను ఒప్పించి పెండ్లి చేసుకుంటానని నమ్మించడంతో తరుచూ కలుసుకున్నారు. మూడునెలల క్రితం ఐశ్వర్య గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించాడు. 
 
ఈ క్రమంలో ఇటీవల అషేర్‌ సోదరికి వివాహమై.. ఆమె నెల తప్పింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఐశ్వర్య తనకు అబార్షన్‌ చేయించి అన్యాయం చేశావంటూ అషేర్‌తో గొడవకు దిగడంతో పాటు పెండ్లి విషయమై నిలదీసింది. 
 
దాంతో తల్లితో మాట్లాడి చెబుతానంటూ ఇంటికి వెళ్లిన అషేర్‌ ముఖం చాటేశాడు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన ఐశ్వర్య బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3లో తాను నివాసం ఉంటున్న హాస్టల్‌లో మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలు తీసుకున్న ఐశ్వర్య.. తనను మోసం చేసిన అషేర్‌ను వదిలిపెట్టవద్దని, తన చావుకు కారణం అతడు చేసిన మోసమే అని చెప్పింది. దీంతో పాటు తనను క్షమించాలని, చెప్పిన మాట వినకుండా ప్రేమ పేరుతో మోసపోయానంటూ తండ్రికి కూడా ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.