శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (11:51 IST)

గిరిజన యువతిగా కీర్తి సురేష్ - "గుడ్ లక్ సఖీ" ట్రైలర్ రిలీజ్

క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "గుడ్ లక్ సఖీ" చిత్రం ట్రైలర్ సోమవారం రిలీజ్ చేసారు. ఈ చిత్రం ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో ఈ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ గిరిజన యువతిగా కనిపిస్తున్నారు. మాటలో యాస, వేషధారణ, నడకలో పూర్తి వైవిధ్యం చూపించినట్టుగా కనిపిస్తుంది. ఇందులో కీర్తి సురేష్ సరసన ఆది పినిశెట్టి హీరోగా నటించారు. 
 
ఆమె ప్రతిభను గుర్తించిన హీరో ఆమెను జగపతిబాబు వద్దకు తీసుకుని రావడం, రైఫిల్ షూటర్‌గా ఆయన ఆమెను తీర్చిదిద్ది విజయం సాధించేలా చేయడం ఈ ట్రైలర్‌లో చూపించారు. మహానటి చిత్రం తర్వాత నాయిక ప్రధానమైన పాత్రలో కీర్తి సురేష్ చేసిన పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.