బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (13:58 IST)

అతిథి హీరోయిన్ అమృతరావు రెండో పెళ్లి చేసుకుంది.. ఎవరినో తెలుసా?

Amrita Rao
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అతిథిలో నటించిన హీరోయిన్ అమృతరావు రెండో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అమృతరావు రెండో పెళ్లి చేసుకున్నది ఎవరినే కాదు.. మొదటి భర్తనే మరోసారి పెళ్లి చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అమృతరావు, అన్మోల్‌ ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2014లో రహస్య వివాహం చేసుకున్నారు. వీరికి 2020లో ఓ బాబు పుట్టాడు. 'కపుల్ ఆఫ్ థింగ్స్​' పేరుతో వీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేసి అనేక విశేషాలు పంచుకుంటుంటారు. 
 
ఈ ఛానెల్​లోనే ఇటీవల వీరు రెండోసారి పెళ్లి చేసుకున్న వీడియోను పోస్ట్​ చేశారు. కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.