సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (09:06 IST)

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫిగ‌ర్ క‌న్నా మంగ్లీ సెక్సీ - రామ్‌గోపాల్ వ‌ర్మ‌

Mangli, Ramgopal Varma
Mangli, Ramgopal Varma
రామ్‌గోపాల్ వ‌ర్మ ఎక్క‌డున్నా ఏదోర‌కంగా మాట‌ల్తో శృంగార‌ప‌దాలు దొర్లిస్తుంటాడు. తాజాగా తెలంగాణ గాయ‌ని మంగ్లీ గురించి చేసిన కామెంట్‌తో ఆమె ఫిదా అయిపోయింది. వెంట‌నే వ‌చ్చిన ఆయ‌న కాళ్ళ‌మీద ప‌డింది. ఆ త‌ర్వాత మ‌రో విశేషం జ‌రిగింది. స్టేజీపైన వున్న రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను డాన్స్ చేయ‌మ‌ని యాంక‌ర్ కోర‌గా, ఇప్పుడు కాదులే అంటూ సున్నితంగా తిర‌స్క‌రించాడు. కానీ అక్క‌డే వున్న మంగ్లీ మాత్రం వ‌ర్మ‌సార్ డాన్స్ చేస్తే నేనూ చేస్తానంటూ ట్విస్ట్ ఇచ్చింది.
 
అస‌లు విష‌యం ఏమంటే, కిచ్చా సుదీప్ సినిమా `విక్రాంత్ రోణ‌` 3డి సినిమా. త్వ‌ర‌లో రాబోతుంది. హైద‌రాబాద్ ప్ర‌మోష‌న్ కోసం చిత్ర టీమ్ వ‌చ్చింది. ఈ సినిమాలో  బాలీవుడ్ డాన్స‌ర్‌, న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ ఐటం సాంగ్ చేసింది. ఆ సాంగ్‌ను మంగ్లీ పాడింది. త‌న గ‌మ్మ‌తైన గొంతు ఆ పాట‌కు హైలైట్ చేసింది. ఈ పాట ప్రొజెక్ష‌న్ త‌ర్వాత రామ్‌గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ, 3డిలో పాట చాలా బాగుంది. విజువ‌ల్స్ బాగున్నాయి. జాక్వెలిన్ డాన్స్ బ్ర‌హ్మాండ‌గా వుంది. నాకు ఈ డాన్స్ చూశాక జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫిగ‌ర్ క‌న్నా మంగ్లీ వాయిస్ చాలా సెక్సీ గా వుంది. అని చెప్పాడు. దాంతో వెంట‌నే వ‌చ్చి రామ్‌గోపాల్ వ‌ర్మ‌కాళ్ళ‌కు న‌మ‌స్కారం చేసేసింది. ఆ త‌ర్వాత వ‌ర్మ‌తో డాన్స్ చేస్తాన‌ని కూడా చెప్పింది. కానీ హీరో సుదీప్ కూడా సున్నితంగా తిర‌స్క‌రించ‌డంతో వ‌ర్మ‌తో డాన్స్ చేసే అవ‌కాశం మంగ్లీ కోల్పోయింది. సో.. త‌ర్వాత సినిమాలో మంగ్లీకి వ‌ర్మ ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.