kicha Sudeep, Vijayendra Prasad, Ram Gopal Verma, Mangli, Akhil and others
శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ విక్రాంత్ రోణ. జూలై 28న ఈ త్రీడీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కిచ్చా సుదీప్ నటించిన ఈ చిత్రాన్ని అనూప్ భండారి డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ చిత్రంలో జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ సమర్పణలో జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉత్తరాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్ నిర్మించారు. ఇన్‌వెనియో ఆరిజన్స్ బ్యానర్‌పై అలంకార్ పాండియన్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ, అఖిల్ అక్కినేని, విజయేంద్ర ప్రసాద్, మంగ్లీ, అనూప్ భండారి, షాలిని తదితరులు పాల్గొన్నారు.
కిచ్చా సుదీప్ మాట్లాడుతూ విక్రాంత్ రోణ రూప కల్పనలో చాలా విషయాలు దగ్గరయ్యాయి. నా స్నేహితుడు జాక్ మంజునాథ్, దర్శకుడు అనూప్‌కు ముందుగా థాంక్స్. అనూప్ నాతో ఈ సినిమా కోసం నాలుగేళ్లకు పైగానే ట్రావెల్ అయ్యాడు. అనూప్ నా కార్యెక్టర్‌ను గొప్పగా చూపించడానికి ఎంతో ఆలోచించాడు. కోవిడ్ తర్వాత ఈ సినిమా చేయాలని నాగార్జునగారిని అడిగితే మా కోసం గేట్స్ తెరిచారు. అన్నపూర్ణ స్టూడియోలో రెండున్నర నెలలకు పైగానే చిత్రీకరించాం. అన్నీ ఫ్లోర్స్ మాకే ఇచ్చేశారు. కోవిడ్ భయం ఉన్నప్పటికీ .. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఓ కోవిడ్ కేసు లేకుండా షూటింగ్‌ను పూర్తి చేశాం. సమయం కూడా మాకు సపోర్ట్ చేసింది. ఈగ సినిమా వంటి సినిమాను నాకు ఇచ్చిన రాజమౌళిగారికి, విజయేంద్ర ప్రసాద్‌గారికి థాంక్స్. అలాగే నా జర్నీ స్టార్ట్ కావటానికి కారకుడైన ఆర్జీవీగారు ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగాఉంది. జూలై 28కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. దర్శకుడు అనూప్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు. చాలా రోజుల పాటు నిద్ర పోలేదు. గొప్ప ఉద్దేశంతో సినిమా చేశాడు. జాక్ మంజునాథ్ గురించి ఎంత ఎక్కువగా మాట్లాడినా తక్కువే. తను బ్యాక్ బోన్‌లా నిలబడ్డాడు కాబట్టే ఈ సినిమాను ఇంత గొప్పగా చేయగలిగాం. జూలై 28న విక్రాంత్ రోణ సినిమాను అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి. ఓ మంచి గొప్ప ఎక్స్‌పీరియెన్స్ దొరుకుతుంది అన్నారు.
నిర్మాత షాలిని మంజునాథ్ మాట్లాడుతూ ఈ సినిమాకు నా భర్త.. నిర్మాత జాక్ మంజునాథ్ బ్యాక్ బోన్‌గా నిలిచి సపోర్ట్ చేశారు. విక్రాంత్ రోణ సినిమా గురించి కిచ్చా సుదీప్ గారు చెప్పినప్పుడు ఆయన విజన్ మాకు అర్థమైంది. అందువల్లనే మేం భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించాం. డైరెక్టర్ అనూప్ భండారి, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ సహా అందరూ మా విజన్‌ను నిజం కావడంలో తోడ్పడ్డారు. ఈ సందర్భంగా వారికి థాంక్స్ చెబుతున్నాను. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ ప్రపంచంలోనే మరిన్ని కొత్త హిస్టరీలను క్రియేట్ చేయనుంది. సినిమాను త్రీడీలో రూపొందించాం. పాండమిక్ సమయంలో ఎంతో జాగ్రత్తగా, కష్టపడి సినిమాను నిర్మించాం. కిచ్చా సుదీప్‌గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వల్లనే ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయగలిగాం. అలాగే మా సినిమా తెలుగు ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్‌గారికి స్పెషల్ థాంక్స్ అన్నారు.
ఫైట్ మాస్టర్ ఎ.విజయ్ మాట్లాడుతూ విక్రాంత్ రోణ చిత్రాన్ని మంచి కోవిడ్ సమయంలో స్టార్ట్ చేశాం. ఎవరు షూటింగ్ చేయని సమయంలో సుదీప్‌గారు, మంజుగారు, శివ్‌గారు.. సహా అందరూ ఇక్కడికి వచ్చి సెట్ వేసి అన్నపూర్ణలో చిత్రీకరించారు. మూడు వందల మందికి పని దొరికింది. ఆ సమయంలో అలాంటి ధైర్యంతో ముందుకు వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు. ఎంతో కష్టపడి చేశాం. ఈ సినిమాలో నాకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసే అవకాశం నాకు కల్పించిన కిచ్చా సుదీప్‌గారికి, డైరెక్టర్ అనూప్ భండారికి, నిర్మాత జాక్ మంజునాథ్‌గారికి థాంక్స్ అన్నారు.
దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ నాకు తెలుగు చిత్రసీమతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. నేను వర్క్‌చేసిన తొలి చిత్రం గీతాంజలి. అలాగే దర్శకుడు అయిన తర్వాత రంగితరంగ, రాజారథం సినిమాలు కూడా ఇక్కడే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకున్నాయి. అలాగే విక్రాంత్ రోణ సినిమా విషయానికి వస్తే.. అన్నపూర్ణలో ఎక్కువగా సెట్స్ వేసి చిత్రీకరించాం. నాగార్జునగారు కొన్ని సీన్స్ చూసి నన్ను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు మా సినిమాను చూసి ప్రశంసించటమే కాకుండా సపోర్ట్ చేస్తూ వచ్చారు. వారికి నా థాంక్స్. అలాగే ఈ సినిమాలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు కిచ్చా సుదీప్‌గారు పిల్లర్‌గా నిలబడి సపోర్ట్ చేశారు.ఆయనకు థాంక్స్ అన్నారు.
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ట్రైలర్, పాట చాలా చాలా బావుంది. ఎంటైర్ టీమ్‌కి అభినందనలు అన్నారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఇంతకు ముందు కన్నడ సినీ ఇండస్ట్రీ అంటే ఏదో చిన్న పల్లెటూర్లో సినిమాలు తీస్తున్నారనే ఫీలింగ్ ఉండేది. కానీ ఈరోజున తెలుగు సినీ ఇండస్ట్రీకే కాదు.. ఇండియన్ సినిమాకే ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తోంది. కె.జి.యఫ్ 2 వచ్చింది. ఇప్పుడు విక్రాంత్ రోణ సినిమా వస్తుంది. ఈ సినిమాను రఫ్ వెర్షన్ చూశాను. చూసి చాలా ఆశ్చర్యపోయాను. స్టోరీ, సుదీప్ పెర్ఫామెన్స్, డైరెక్టర్ అనూప్ తీసిన తీరు. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ఫైట్ సీక్వెన్స్‌లున్నాయి. కొత్త రకమైన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. త్రీడీలో ఇప్పుడే చూశాను. పాట, దాన్ని తీసిన విధానం బావుంది. ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే.. అనూప్ భండారి నుంచి ఇలాంటి డిఫరెంట్ మూవీ వస్తుందని అనుకోలేదు. ఇక సుదీప్ వెర్సటాలిటీ గురించి అందరికీ తెలిసిందే. తను ఎలాంటి రోల్ అయినా చేస్తాడు. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ పెర్ఫామెన్స్ అనుకుంటున్నాను అన్నారు.
అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ట్రైలర్ అద్భుతంగా ఉంది. టెక్నికల్ బ్రిలియెన్స్, క్రియేటివ్ బ్రిలియెన్స్ కాంబినేషన్‌గా ఉంది. అనూప్‌గారు ఇలాంటి విజన్‌ను ఆలోచించినందుకు, దాన్ని ముందుకు తీసుకెళ్లిన కిచ్చా సుదీప్‌గారికి అభినందనలు. అందరూ ఓ మంచి టీమ్‌గా ఏర్పడి గొప్ప సినిమాను రూపొందించారు. కిచ్చా సుదీప్‌గారి గురించి నాకు పదేళ్ల నుంచి తెలుసు. సీసీఎల్ సమయంలో ఆయనతో ఎక్కువ సమయం గడిపాను. ఆయన చూపులు, వాయిస్ కంటే ఆయన బ్రెయిన్ చాలా పవర్ ఫుల్. ఇలాంటి సినిమాలు తీసి మాలాంటి వారిని ఇన్‌స్పైర్ చేస్తున్నందుకు సుదీప్‌గారికి థాంక్స్. విక్రాంత్ రోణ చిత్రం..కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది. సౌత్ ఇండియన్‌గా ఎంతో గర్వపడుతున్నాను అన్నారు.