శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు షాకిచ్చిన ఈడీ

Jacqueline Fernandez
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేరుకోలేని షాకిచ్చింది. ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీ కేసులో భాగంగా జాక్వెనిల్‌కు చెందిన 7.27 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు తాజాగా ప్రకటించారు. 
 
ఈడీ అటాచ్ చేసిన వాటిలో రూ.7 కోట్ల మేరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఈయన నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అత్యంత ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు సమాచారం. 
 
వీటిలో ప్రధానంగా ఖరీదైన వజ్రాలు, బ్రాస్‌లెట్స్, మినీ కూపర్, డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్‌లు, చెవిపోగులు వంటి అనేక కానుకలు ఉన్నాయి. ఈ బహుమతులను కేవలం జాక్వెలిన్‌కు మాత్రమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆమెకు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను జప్తు చేశారు.