గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (13:03 IST)

తిరుమలలో సబ్ స్టేషన్ వద్ద హల్చల్ చేసిన ఎలుగుబంట్లు

bears
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. తిరుమల నడకదారి మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తూ భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో తిరుమల సబ్‌స్టేషన్ సమీపంలో ఏకంగా మూడు ఎలుగుబంట్లు సంచరించాయి. వీటిని చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. 
 
ఈ ఎలుగుబంట్లను చూసిన భక్తులు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించడంతో సైరెన్ మోగిస్తూ వాటిని అటవీ ప్రాంతం వైపు తరివేశారు. అర్థరాత్రిపూట ఒకేచోటు మూడు ఎలుగుబంట్లు కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. కాగా, గత కొన్ని రోజులుగా తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.