సంబంధిత వార్తలు
- తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పవర్: వెనక్కి తగ్గిన తితిదే ఛైర్మన్
- టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కోపం వచ్చింది, ఎందుకంటే?
- తిరుమలేశుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులతో టిటిడి ప్రత్యేక క్యాలెండర్
- 20 లక్షలతో మహిళా విశ్వవిద్యాలయంలో శ్రీవారి ఆలయం: టిటిడి ఛైర్మన్
- వచ్చే ఏడాది నుంచి తిరుమల వెళ్ళే భక్తులకు దర్శన టిక్కెట్ల సంఖ్య పెంపు
విజిలెన్స్ అంచనాలు తప్పాయి .. అందుకే తొక్కిసలాట : వైవీ సుబ్బారెడ్డి
ఇటీవలి తిరుమల కొండపై జరిగిన తొక్కిసలాటపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తితిదే విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనాలు తప్పడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై కింది స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తిరుపతి ఎస్పీ గోశాలలో రూ.3 కోట్లతో నెయ్యి ఉత్పత్తి కేంద్రానికి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భక్తుల తొక్కిసలాటకు ప్రధాన కారణం విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బంది అంచనాలు తప్పడం వల్లే తోపులాట జరిగిందన్నారు. దీంతో పరిస్థితిని సమీక్షించే వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఈ వేసవిలో శ్రీవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అందుకు తగినట్టుగా తాము భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో టైమ్ స్లాట్ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కంపార్టుమెంట్లలో భక్తులను ఉంచి విడతల వారీగా శ్రీవారి దర్శనానికి పంపుతామని ఆయన వెల్లడించారు.
