మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (15:31 IST)

తితిదే భక్తులకు శుభవార్త : మెట్ల మార్గంలో భక్తులకు అనుమతి

tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు భక్తులకు మరో శుభవార్త చెప్పారు. మే నెల ఒకటో తేదీ నుంచి భక్తులను శ్రీవారి మెట్లు మార్గంలో అనుమతిస్తామని తెలిపారు. 
 
గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల మెట్ల మార్గం కొట్టుకుపోయాయి. ఈ మార్గంలో మరమ్మతులు పూర్తికావడంతో భక్తులకు అనుమతి స్తున్నట్లు అధికారులు తెలిపారు.
 
కాగా శనివారం 76,746 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 31,574 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా టీటీడీ హుండీకి రూ.4.62 కోట్లు ఆదాయం వచ్చిందని సంబంధిత అధికారులు వివరించారు.