శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (17:15 IST)

తెలుగు రాష్ట్రాలకు చల్లని వార్త.. రెండు రోజుల పాటు వర్షాలు

Rains
తెలుగు రాష్ట్రాలకు చల్లని వార్త. తెలుగు రాష్ట్రాల్లో గురు, శుక్రవారాలు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు, గరిష్ఠంగా 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
 
ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల స్వల్పస్థాయిలో వర్షం కురుస్తుందని, రాయలసీమలో ఇవాళ ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని వివరించింది.
 
అటు, తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.