గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:55 IST)

అమ్మాయిలకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

ys jagan
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మాయిలకు శుభవార్త చెప్పారు. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కాలేజీలు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. 
 
నాడు-నేడు కింద 468 జూనియర్‌ కళాశాలల్లో పనులు నిర్వహించాలని, ప్రతి మండలానికీ రెండు జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని బుధవారం అధికారులను ఆదేశించారు. 
 
వీటిలో అమ్మాయిల కోసం ప్రత్యేక కాలేజీలు వుండాలన్నారు. ఈ కాలేజీల ఏర్పాటుకు దాదాపుగా రూ. 960 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు జగన్‌కు వివరించారు.
 
ఈ నేపథ్యంలో నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్‌ పూర్తి చేశామని, విడతల వారీగా ఆరు కేటగిరీల స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. జులై 2024 నాటికి సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమాన్ని పూర్తి చేయండని జగన్ అన్నారు.