శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (15:42 IST)

నన్ను పిల్లల్ని వదిలిపెట్టి.. రెండో పెళ్లి చేసుకుంటావా?

romance
తన భర్త వివాహేతర సంబంధాన్ని ఓ యువతి బట్టబయలు చేసింది. సూర్యాపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలు, తనను వదిలిపెట్టి మరో యువతిని వివాహమాడటంతో పాటు రహస్యంగా కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది మొదటి భార్య.
 
వివరాల్లోకి వెళితే.. భానుప్రకాశ్ అనే వైద్యుడు భార్య పిల్లలను వదిలేసి మరో యువతితో కాపురం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య బంధువుల సహాకారంతో భర్తను పట్టుకొని చితకొట్టింది. తన భర్తతో కాపురం చేస్తున్న యువతిని చితకబాదింది. 
 
తన వివాదం కోర్టులో నడుస్తుండగా.. రహస్యంగా వివాహం చేసుకొని కాపురం పెట్టాడని మొదటిభార్య ఆరోపిస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.