బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (18:08 IST)

శోభనం రోజున భర్తతో నవ వధువు షాకింగ్ న్యూస్, తెల్లారేసరికి ఏమైందంటే...?

కొత్తగా పెళ్లయింది. కొత్త జంటకు తొలిరాత్రి శోభనం ఏర్పాట్లు చేసారు. ఆ రోజు రాత్రి ఇద్దరూ తమతమ జీవితాలలో జరిగిన గత అనుభవాలను చెప్పుకోవడం ప్రారంభించారు. ఐతే నవ వధువు చెప్పిన మాటకి నవ వరుడు షాక్ తిన్నాడు. తెల్లారేసరికి తన భార్యను పుట్టింటిలో వదిలేసాడు. ఏం జరిగిందంటే..?

 
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో 2019లో ఓ జంటకు పెళ్లయింది. పెద్దలు వారికి శోభనం ఏర్పాట్లు చేసారు. శోభనం గదిలో ప్రవేశించిన నవ వధూవరులు తమ గత అనుభవాలను చెప్పుకోసాగారు. ఐతే తన జీవితంలో దారుణమైన ఘటన వుందని నవ వధువు చెప్పింది. అదేంటనే భర్త అడగటంతో....

 
ఆమె ఇలా చెప్పింది. తను యుక్తవయసులో వుండగా తనపై తన మేనమామ కుమారుడు అత్యాచారం చేసాడని షాకింక్ న్యూస్ చెప్పింది. దీనితో కట్టుకున్న భర్త తెల్లారగానే ఆమెను తీసుకెళ్లి పుట్టింట్లో వదిలి ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పాడు. ఈ మాట విని బాధితరాలి తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేశారు.

 
మరోవైపు తన భార్యతో తనకు విడాకులు ఇప్పించాలని భర్త కోర్టును ఆశ్రయించాడు. 2019 నుంచి కోర్టు విచారణ చేసిన మీదట చివరికి ఆమెతో జరిగిన వివాహాన్ని కోర్టు రద్దు చేసింది.