ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (11:40 IST)

అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య

romance
భర్తతో కలిసి వుండాల్సిన భార్య వివాహేతర సంబంధాన్ని కొనసాగింది. అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు తాళి కట్టిన భర్తనే కడతేర్చిన ఘటన పాలమూరు జిల్లాలో వెలుగు చూసింది..
 
వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామం హరిజనవాడకు చెందిన శ్రీశైలం తన భార్య గీత గత కొన్ని నెలల క్రితం హైదరాబాదులోని బతుకుదెరువు కోసం కూలిపనికి వెళ్లారు. 
 
కుటుంబ పోషణ కోసం భార్య గీత అక్కడ తెలిసిన రాజు, విక్రమ్‌ల వద్ద 50 వేల రూపాయలను అప్పుగా తీసుకుంది. దీంతో అప్పు ఇచ్చిన సాకుతో విక్రమ్.. గీతతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకున్నారు. దీంతో ఇటీవల కాలంలో శ్రీశైలం, గీతలు కలిసి తమ స్వగ్రామమైన బూరుగుపల్లికి వచ్చారు. 
 
జీవనోపాధి కోసం శ్రీశైలం రోజు కూలిగా పని చేస్తున్నాడు. కాగా తన భర్త శ్రీశైలంని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నిన భార్య గీత, ఆమె తల్లి, రాజు, విక్రమ్ కలసి ప్లాన్ వేశారు.
 
దీనిలో భాగంగా గత నెల 31 వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో డబ్బు విషయమై మాట్లాడదామని గ్రామ సమీపంలో వ్యవసాయ పొలాల్లోకి రప్పించారు. 
 
అక్కడ శ్రీశైలానికి పీకలదాకా మద్యం తాగించి కళ్లల్లో కారం కొట్టి.. రాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో భార్యే హంతకురాలని తేలింది.