బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (17:02 IST)

గొల్లప్రోలులో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

గొల్లప్రోలులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెందుర్తి-వజ్రకూటం మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లాలో గొల్లప్రోలు మండలం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. 
 
రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వైద్య చికిత్స కోసం ఆటో డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లే అవకాశముంది.