శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:02 IST)

ఉద్యోగం ఐటీ ప్రొఫెషన్ - చేసేది గంజాయి వ్యాపారం

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో ఐటీ ఉద్యోగం చేస్తూ గంజాయిని విక్రయిస్తున్న ఓ మహిళా ఐటీ టెక్కీని పోలీసులు అరెస్టు చేశారు. వారికి సహకరించిన ఇద్దరు యువకుల నుంచి 1.2 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నాచారంలో ఉంటున్న కొండపనేని మాన్సీ అనే ఐటీ ఉద్యోగిని తన భర్త మదన్ మేనేకర్‌తో కలిసి గత రెండేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తుంది. గత నెల 12వ తేదీన ఈ దంపతులు ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా బోయినపల్లి పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. 
 
కానీ, పోలీసుల రాకను గుర్తించిన దంపతులు చాకచక్యంగా తప్పించుకుని పారిపోయారు. కాన, వారితో ఉన్న ఇద్దరు యువకులు మాత్రం 1.2 కేజీల గంజాయితో పట్టుబడ్డారు. భోపాల్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంది. నాచారంలో భర్తతో కలిసి మూడేళ్లుగా నివసిస్తూ గంజాయి వ్యాపారం చేస్తూ వస్తుంది.