శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (11:16 IST)

దేశంలో పెట్రోల్ ధరలపై క్రూడ్ ఆయిల్ ప్రభావం

దేశంలో పెట్రోల్, డీజల్ ధరలపై క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం అధికంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం భారత్ చమురు ధరలపై పడుతుంది. దీంతో పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా గత 11 రోజుల్లో ఏకంగా 10 సార్లు పెట్రోల్ ధరలు పెంచేశాయి. 
 
అయితే, శుక్రవారం ఈ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఢిల్లీ, ముంబైతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో చమురు ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో 137 రోజుల పాటు స్థిరంగా ఉన్న చమురు ధరలు గత నెల 27వ తేదీ నుంచి పెంచుతున్నారు. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.115.42గా ఉంటే, లీటరు డీజల్ ధర రూ.101.58గా ఉంది. ఖమ్మంలో రూ.114.60గా ఉంటే, డీజల్ ధర రూ.100.77గా వుంది.
 
అదేవిధంగా విజయవాడ నగరంలో పెట్రోల్ ధర రూ.116.39గా వుంటే డీజల్ ధర రూ.93.07గా వుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఒక్క ఏపీలోనే పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది. 
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.101.81గా ఉంటే డీజల్ ధర రూ.93.07గా వుంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.116.72గా ఉంటే డీజల్ ధర రూ.93.07 వుంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.111.35గా ఉంటే డీజల్ ధర రూ.96.22గా వుంది.