1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శుక్రవారం, 25 జులై 2025 (18:47 IST)

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

Thummalapalli Rama sathya Narayana
Thummalapalli Rama sathya Narayana
మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా, శతాధిక చిత్ర నిర్మాతల్లో  రెండవ వాడిగా ఘనతకెక్కిన భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ... ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 15 చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. 
 
ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రక ఘట్టానికి హైదరాబాద్‌లోని సారధి స్టూడియో వేదిక కానుంది. సినిమా రంగంతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు. మన భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ అరుదైన ఘట్టం శ్రీకారం చుట్టుకోనుంది!!