Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!
భార్యాభర్తల గొడవలు ప్రస్తుతం నాలుగు గోడలకే పరిమితం కావట్లేదు. ఈ గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా హైదరాబాదులో ఘోరం జరిగింది. మేనకోడలిపై పుట్టినరోజు వేడుకలో భార్యను ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. హైదరాబాద్ శివారుప్రాంతం అబ్దుల్లాపూర్ మెట్టులో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హతమార్చాడు. పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేస్తుండగా.. కత్తితో భార్య పీక కోశాడు.
ఈ ఘటనలో తీవ్రగాయమైన మహిళ ప్రాణాలు కోల్పోయింది. భార్యాభర్తల మధ్య విబేధాలున్నాయని.. వీరిద్దరూ చాలాకాలం పాటు సపరేటుగా వున్నారు. భార్య సమ్మక్క ఇటీవలే భర్తతో గొడవపడి అబ్దుల్లాపూర్ మెట్టులో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటుంది. భార్యపై కోపంతో రగిలిపోయిన భర్త శ్రీనివాస్ సూర్యాపేట నుంచి వచ్చి భార్యను హత్య చేసి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.