భార్య సోదరితో భర్త వివాహేతర సంబంధం: రోడ్డుపై భర్తపై దాడికి దిగిన భార్య (video)
రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్ పూర్ రోడ్డుపైన ఓ భార్య తన భర్తను పట్టుకుని ఎడాపెడా బాదుతున్న దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారు నుంచి భర్తను బైటకు లాగి అతడి కాలర్ పట్టుకుని రోడ్డుపైనే అతడిపై దాడి చేసింది అతడి భార్య.
తన సొంత చెల్లెలితోనే వివాహేతర సంబంధం పెట్టుకుని కారులో బలాదూర్ గా తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ మహిళ. రోడ్డుపైనే అతడి కాలర్ పట్టుకుని అటుఇటూ లాగుతూ దాడి చేస్తుండగా స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దాంతో వ్యవహారం కాస్తా పోలీసుల దాకా వెళ్లింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ సముదాయించే ప్రయత్నం చేసారు. ఐనప్పటికీ ఇద్దరూ మొండికేయడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసారు. చెరో రూ. 50,000 పూచీకత్తుతో ఇద్దరినీ వదిలిపెట్టారు.
కాగా వీరిద్దరూ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. తన భార్య తనను వేధిస్తోందని భర్త చెపుతుండగా, తన సోదరి మోజులో పడి తనను అన్యాయం చేసాడంటూ భార్య ఆరోపిస్తోంది. దీనిపై పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు.