1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (12:21 IST)

ఏపీలో వడగాడ్పులు... జాగ్రత్త అవసరం

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని  పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని కొన్నిచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తాజా బులెటిన్‌లో పేర్కొంది. 
 
విజయనగరం జిల్లా కొమరాడ, కురుపాం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. మరో 13 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది.