సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (12:53 IST)

ఏపీలో కొత్త జిల్లాల ఇష్యూ : త్వరలో నోటిఫికేషన్ విడుదల

ఏపీలో కొత్త జిల్లాల ఇష్యూ చివరి దశకు చేరుకుంది. త్వరలో నోటిఫికేషన్ వదిలేందుకు అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. 
 
ఇప్పటివరకు వచ్చిన 11వేలకు పైనా అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. మరిన్నీ కొత్త రెవెన్యూ డివిజన్స్‌ను పెంచే అవకాశం కనిపిస్తోంది. 
 
కొన్ని జిల్లాల పేర్ల మార్పుతో పాటు కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయనుంది. జిల్లా కేంద్రాల మార్పు కొన్ని మండలాలను వేరే జిల్లాల్లో కొనసాగించడం వంటి డిమాండ్లు కూడా ప్రభుత్వానికి చేరాయి. 
 
క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సీఎం జగన్ అధికారులతో రివ్యూ చేశారు. ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్లాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది.