శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (14:36 IST)

ఏపీలో తుది దశకు చేరుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంది. అదేసమయంలో కొత్త జిల్లాల ఏర్పాటులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చేరిన దాదాపు 10 నుంచి 11 వేల వినతులు అభ్యంతరాలను కూడా పరిశీలించింది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటులో పెద్దగా మార్పులేమీ చేయకుండానే ప్రభుత్వం అనుకున్నట్టుగానే ముందుకుసాగనుంది. 
 
ముఖ్యంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో చెప్పిన 11 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో ఐదు డివిజిన్ల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాల వారీగా ఐపీఎస్, ఐఏఎస్, ప్రభుత్వ అధికారుల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తిచేశారు. అలాగే, కొత్త జిల్లాల కలెక్టరేట్లలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై ఆయా జిల్లాల యంత్రాంగం దృష్టిసారించి చకచకా ఏర్పాట్లు చేస్తుంది.