ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (10:24 IST)

నేడు మేకపాటి గౌతం రెడ్డి సంస్మరణ సభ - నెల్లూరుకు సీఎం జగన్

ఇటీవల హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సంస్మరణ సభ సోమవారం నెల్లూరులో జరుగనుంది. ఇందులోపాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నారు. ఇందులోభాగంగా ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారు. 
 
ఆ తర్వాత గొలగమూడి పీవీఆర్ కన్వెన్షన్ సెంటరులో దివంగత మేకపాటి గౌతం రెడ్డి సంతాప సభలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన మధ్యాహ్నం 2.40 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 
 
అయితే, సీఎం జగన్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. సీఎం జగన్ పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత తాడేపల్లిలో తన మంత్రివర్గ సహచరులతో ఆయన కీలక సమావేశం నిర్వహిస్తారు.