గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (19:29 IST)

సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్

సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రోబెషన్ ను అమలు చేస్తామని ఇప్పటికే సీఎం వైయస్ జగన్ ప్రకటించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
 
సచివాలయాల్లో ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారని, వారి పనితీరును గమనించిన సీఎం జగన్ వారికి జూన్ నెలలో ప్రోబెషన్ డిక్లేర్ చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు. 
 
సచివాలయ ఉద్యోగుల గురించి తమకే బాధ్యత ఉన్నట్లుగా, తమ హయాంలో ఉద్యోగాలు ఇచ్చినట్లు టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. దీనిపై తెలుగుదేశం అతిగా స్పందించాల్సిన అవసరం లేదని హితవు పలికారు.
 
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం జగన్ ముందుచూపుతో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏకకాలంలో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా సీఎంకే దక్కుతుందని పేర్కొన్నారు.