ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (13:51 IST)

గౌతంరెడ్డిని రాజకీయాలు నేర్పించింది నేనే : సీఎం జగన్

ఇటీవల హఠాన్మరణం చెందిన మేకపాటి గౌతంరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయాలు నేర్పింది తానేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరులోని పీవీఆర్ కన్వెన్షన్ సెంటరులో మేకపాటి గౌతంరెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఇందులో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా గౌతంరెడ్డికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, తన ప్రతి అడుగులో గౌతంరెడ్డి తోడుగా ఉన్నారన్నారని చెప్పారు. తనను ఆయన ఎల్లపుడూ ప్రోత్సహించేవారని తెలిపారు. ఆయనను తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని వెల్లడించారు. 
 
పరిశ్రమల శాఖలో ఆరు విభాగాలను గౌతం రెడ్డి చూసేవారన్నారు. ఏపీకి పరిశ్రమలు తీసుకురావాలని గౌతంరెడ్డి తపనపడేవారని, పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనేవారనీ జన్ చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఓ మంచి స్నేహితుడుని కోల్పోయానని, సంగం బ్యారేజీకి మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజీ పేరు పెడతామని సీఎం జగన్ వెల్లడించారు.