ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (14:50 IST)

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా హైకమాండ్ కసరత్తు చేస్తోంది.. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.. ఏప్రిల్‌ 11వ తేదీన కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్.
 
ఇప్పుడు కేబినెట్‌ విస్తరణలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో హాట్‌ హాట్‌ చర్చ సాగుతోంది. మొత్తంగా మూడేళ్ల గడువుకు ముందే కొత్త మంత్రులు కొలువదీరబోతున్నారు. మూడేళ్ల తర్వాత మార్పులు చేయాలనుకున్నా ముహూర్త బలం కోసం ఏప్రిల్‌లోనే కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ చేసేందుకు సిద్ధం అయ్యారు. 
 
మరోవైపు కేబినెట్‌లో ఉన్నవారిలో ఒక టెన్షన్‌ అయితే.. ఇక, కేబినెట్‌ పదవులు ఆశిస్తున్నవారిలోనూ ఈసారైనా పదవి దక్కుతుందా? లేదా? అనే టెన్షన్‌ నెలకొంది.