1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (08:17 IST)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ హసానుద్దీన్ అమానుల్లా ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ హసానుద్దీన్ అమానుల్లాచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్రమాణం చేయించారు.

ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలోని మొదటి కోర్టు హాల్లో పాట్నా హైకోర్టు నుండి  ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన జస్టిస్ హసానుద్దీన్ అమానుల్లాచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్రమాణం చేయించారు.

అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈకార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి తోపాటు ఇతర న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం,ఎపి హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.జానకీరామి రెడ్డి,బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గంటా రామారావు, పలువురు రిజిస్ట్రార్ లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.