ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (08:13 IST)

అరూప్ గోస్వామికి ఘనంగా వీడ్కోలు పలికిన గవర్నర్

ఆంధ్రప్రదేశ్ నుండి చత్తీస్ ఘడ్ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి, మీనాక్షి గోస్వామి దంపతులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం జస్టిస్ గోస్వామిని రాజ్ భవన్‌కు ఆహ్వానించిన గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. గోస్వామిని శాలువా, మెమొంటోతో సత్కరించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మరో రాష్ట్రానికి బదిలీపై వెళుతున్న నేపధ్యంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని అకాంక్షించారు. మరిన్ని ఉన్నత పదవులు పొంది రాజ్యంగ బద్దమైన సేవ ద్వారా సమాజానికి మంచి చేయాలని ప్రస్తుతించారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి సుప్రవ హరిచందన్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి ఘనంగా వీడ్కోలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి చతీష్ఘడ్  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో చతీష్ఘడ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.ఈసందర్భంగా బదిలీపై వెళుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ లీగల్ ప్రొపెషన్ అనేది క్లిష్టమైన మరియు పలు సవాళ్ళతో కూడిన వృత్తి అని పేర్కొన్నారు.

హార్డు వర్కుకు మించిన  ప్రత్యామ్నయం మరొకటి లేదని యువ న్యాయవాదులంతా గమనించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు చేశారు.ముఖ్యంగా యువ న్యాయవాదులు అందరూ సామాజిక న్యాయం భావాలను పూర్తిగా అర్ధం చేసుకోవాల్సిన అసరం ఉందని సూచించారు.

గత ఏడాదిన్నర కాలానికి పైగా కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా వర్చువల్ విధానంలో కోర్టులు పనిచేస్తూ ప్రజలకు తగిన న్యాయ సేవలు అందించేందుకు కృషి చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.అందుకు కృషి చేస్తున్న సహచర న్యాయమూర్తుల తోపాటు న్యాయవాదులు న్యాయరంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి అభినందనలు తెలిపారు.

సమాజంలోని ప్రజలందరిలో న్యాయవ్యవస్థపై అవగాహన కలిగించడం తోపాటు లీగల్ లిటరసీని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి స్పష్టం చేశారు.ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం తనకు ఆనందంగా ఉందని ఇందుకు సహకరించిన సహచర న్యాయమూర్తులు సహా అందరికీ పేరుపేరున ధన్యనాదాలు తెలియజేశారు.

కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం మాట్లాడుతూ గత ఎనిమిది మాసాలుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి మెరుగైన రీతిలో పనిచేసి అందరికీ సమాన అవకాశాలు కల్పించారని కొనియాడారు.వివిధ అంశాల్లో ముఖ్యంగా న్యాయాధికారులను,ప్రభుత్వాన్ని,ప్రభుత్వ అధికారులను అన్ని విధాలా మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎపి హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.జానకీ రామిరెడ్డి,బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గంటా రామారావు తదితరులు మాట్లాడారు.కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు,అదనపు అడ్వకేట్ జనరల్,రిజిష్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు,బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.